ఇలా చేయకపోతే మీ బ్యాంకు ఎకౌంట్లు బ్లాక్ అవుతాయి

ఇలా చేయకపోతే మీ బ్యాంకు ఎకౌంట్లు బ్లాక్ అవుతాయి

central govt new bank rules

కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30లోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ వివరాలను అనుసంధానం చేయాలని ఖాతాదారులకు ఐటీ శాఖ సూచించింది. లేని పక్షంలో బ్యాంకు అకౌంట్ బ్లాక్ చేస్తామని కూడా హెచ్చరించింది. అంతేకాదు, జులై 2014 నుంచి ఆగస్ట్ 2015 లోపు బ్యాంకు ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కేవైసీ వివరాలను కూడా సదరు బ్యాంకుకు సమర్పించాలని సూచించింది. విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడి ఖాతాదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఐటీ శాఖ కోరింది. ఈ డెడ్‌లైన్‌కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని, ఆ తర్వాత ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడా ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది.

Share on Google Plus

About Udayam Today

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...